ప్రతి కేసు వేరుగా ఉంటుంది. ట్యూమర్ సైజ్, దాని లొకేషన్, హార్మోన్ రిసెప్టర్ స్టేటస్, పేషెంట్ ఇష్టాయిష్టాలు — ఇవన్నీ కలిపి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాను. ఒక్కో పేషెంట్‌కూ నా సమయం ఇస్తాను. నిర్ణయం వివరిస్తాను. ఎందుకు ఆ సర్జరీ అనవసరం, లేదా ఎందుకు అవసరం అని అర్థమయ్యే భాషలో చెప్తాను.
చాలా మంది అమ్మలు, అక్కలు ఇక్కడికి భయంగా వస్తారు — ఎక్కడో విన్నది వేరే, ఇక్కడ చెప్పేది వేరే అవుతుందని సందేహంతో. కానీ రిపోర్టులు చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు స్పష్టత వస్తుంది.